Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ
శ్రీనగర్ : పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక తీవ్రవాది మృతి చెందాడు. పుల్వామా సెక్టార్లోని ట్రాల్లో తిల్వాని మొహల్లా వగద్ వద్ద భద్రతా బలగాలకు, తీవ్రవాదులకు మధ్య బుధవారం కాల్పులు ప్రారంభమయ్యాయి. గత రెండు రోజుల్లో ఇలా ఎన్కౌంటర్ జరగడం ఇది ఆరవసారి. మరోవైపు కాశ్మీరు లోయలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) నలుగురిని అరెస్టు చేసింది. ఇటీవల లోయలో దాడులకు బాధ్యత తమదేనని ప్రకటించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్)తో వీరికి సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఈవారంలోనే కాశ్మీరు లోయలో జరిగిన ఆపరేషన్స్లలో 8మంది తీవ్రవాదులు, ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారు. గత 24గంటల్లో కాశ్మీరులో పలు చోట్ల దాడులు, సోదాలు నిర్వహించామని ఎన్ఐఎ ప్రతినిధి తెలిపారు. న్యూఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో, జమ్మూ కాశ్మీర్లో హింసాత్మకమైన తీవ్రవాద చర్యలు చేపట్టడానికి కుట్ర పన్నారని ఎన్ఐఎ తెలిపింది.