Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ఇంఫాల్: మణిపూర్లో ఉగ్రవాదులు అనుమానిస్తున్న పలువురు పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఓ మైనర్ సహా మొత్తం ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా విషమంగా ఉందని సమాచారం. రాష్ట్రంలోని కాంగ్పోక్సి జిల్లా బీగానోమ్ గ్రామంలోలోని ఓ మైదానంలో సంతాప సభ నిర్వహిస్తుండగా, మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వీరు నిషేధిత కుకీ నేషనల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మిటిటెం ట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో గ్రామ పెద్ద ఎన్పీ.ఖోలెన్, ఎనిమిది సంవత్సరాల ఓ బాలుడు సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మూడు మృదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, పలువురు గ్రామస్తులు తప్పిపోయారనీ, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.