Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్లో ఘటన
జైపూర్: రాజస్థాన్లో ఓ దళితుడిని కర్రలతో కోడుతూ.. అత్యంత క్రూరంగా హింసించి హత్య చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో హత్యకు ముందు ఆ వ్యక్తిని హింసించి దృశ్యాలను తాజాగా గుజరాత్ ఎమ్మెల్యే జిగేష్ మేవానీ ట్వీట్ చేశారు. ఆ వీడియోలో దళితుడిని నిర్మానుష్యమైన ప్రాంతంలో నెలపై పడుకోబెట్టి.. కాళ్లను మడతగా చేసి ఓ వ్యక్తి పట్టుకోగా.. మరొకరు అతని తలను నేలకేసే అదిమిపట్టు కుని ఉండగా.. మరోవ్యక్తి కర్రతో దాడి చేయడం కనిపించింది. 45 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ''రాజస్థాన్లో ఒక పేద దళిత వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలి. దోషులను చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలి. రాజస్థాన్ ప్రభుత్వం దీనిని ప్రధాన్య అంశంగా పరిగణలోకి తీసుకోవాలంటూ నేను అభ్యర్థిస్తున్నాను'' అంటూ గుజరాత్ ఎమ్మెల్యే జిగేష్ మేవానీ ట్వీట్ చేశారు.