Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గర్భ విచ్ఛిత్తిపై కేంద్రం నూతన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు మార్చిలో పార్లమెంటు ఆమోదించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ (సవరణ ) చట్టం-2021ను నోటిఫై చేస్తూ కొన్ని వర్గాల మహిళలు గర్భవిచ్ఛిత్తి చేసుకోవడానికి గరిష్ట పరిమితి 20 వారాల నుంచి 24 వారాలకు పెంచుతున్నట్టు పేర్కొంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ (సవరణ) నియమాలు- 2021 ప్రకారం వీరిలో లైంగిక వేధింపులు, లైంగికదాడులు, మైనర్లు, గర్భధారణ సమయంలో వైధవ్యం పొందడం విడాకులు తీసుకోవడం, మానసిక అనారోగ్యం ఉన్న వారు, పిండం పూర్తిగా రూపం దాల్చని పరిస్థితుల్లో ఉన్నవారు, ప్రభుత్వం ఆత్యయిక స్థితిని ప్రకటించినపుడు, విపత్తు సమయాల్లో గర్భం దాల్చిన వారిని చేర్చింది.