Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో ఎస్.పుణ్యవతి
ఘంటసాల : జీవితాంతం ఎర్ర జెండాకు అండగా నిలిచిన లీలా కృష్ణయ్య ధన్యజీవి అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి అన్నారు. ఇటీవల కన్నుమూసిన సిపిఎం సీనియర్ నాయకులు వేమూరి లీలా కృష్ణయ్య సంస్మరణ సభ బుధవారం కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోట గ్రామంలోని దోనేపూడి వారి కల్యాణ మండపంలో బుధవారం జరిగింది. ఈ సభలో పుణ్యవతి మాట్లాడుతూ కష్టాలను ఎదుర్కొంటొన్న ప్రజలకు ఎర్ర జెండా ఎప్పుడూ అండగా ఉంటుందని నమ్మి తుదిశ్వాస వరకూ ఆ జెండాకు చేయూతనిచ్చిన లీలా కృష్ణయ్య చిరస్మరణీయులన్నారు. మాజీ ఎంపి గోకరాజు గంగరాజు మాట్లాడుతూ లీలా కష్ణయ్య జీవితాంతం సిపిఎంలోనే కొనసాగారని, రైతులకు, కూలీలకు ఎప్పుడూ అండగా నిలిచేవారని అన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
సిపిఎంకు రూ.50 వేలు విరాళం
వేమూరి లీలా కష్ణయ్య జ్ఞాపకార్థం ఆయన కుమార్తె యార్లగడ్డ విజయరాణి సిపిఎంకు రూ.50 వేల విరాళం అందజేశారు. సంస్మరణ సభలో ఈ విరాళాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పిన్నమనేని మురళీకష్ణ, కష్ణా జిల్లా తూర్పు కమిటీ కార్యదర్శి ఆర్.రఘులకు విజయరాణి అందించారు. ఈ కార్యక్రమంలో లీలా కష్ణయ్య కుమార్తెలు దోనేపూడి విజయలక్ష్మి, చెరుకూరి ఉమాదేవి, కుమారుడు వేమూరి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.