Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : తమిళ నాడులోని తొమ్మిది జిల్లాల్లో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. ఈ ప్రాంతాల్లో పట్టున్నప్పటికీ ఏఐడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూడటం విశేషం. ఈ కూటమిలోని బీజేపీ ఓటమి పాలైంది. అధిక ప్రచారం చేసిన ఎంఎన్ఎం, ఎన్టీకేలు కూడా ఓటమిని చవిచూశాయి. గత ఐదు నెలల్లో తమ ప్రభుత్వ పరిపాలనకు ఫలితంగానే ఈ భారీ విజయం దక్కిందని డీఎంకే పేర్కొంది. తిరునెల్వెలి జిల్లా శివంతిపట్టి గ్రామ సర్పంచ్‌గా 90 ఏండ్ల వృద్ధురాలు ఎంపిక కావడం, టెన్‌కాశి జిల్లాలో ఒక గ్రామంలో సర్పంచ్‌గా 21 ఏండ్ల మహిళ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించడం ఈ ఎన్నికల్లో వార్తలుగా మారాయి. 140 జిల్లా కౌన్సిలర్ వార్డుల్లో 138 వార్డులను డీఎంకే గెలుచుకుంది. తొమ్మిది జిల్లాల్లోని జిల్లా కౌన్సిల్ వార్డుల్లోనూ డీఎంకే కూటమి విజయం సాధించింది. ఈ తొమ్మిది జిల్లాల్లోనూ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను సొంతం చేసుకునే స్థితిలో నిలిచింది. 1,381 యూనియన్ కౌన్సిల్ వార్డుల్లో డీఎంకే 1,010 వార్డుల్లో విజయం సాధించింది.