Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌కు ఆర్థిక సవాళ్లు: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత గోపీనాథ్
న్యూఢిల్లీ. భారత్‌లో 50 శాతం కరోనా టీకాలు వేసినా...థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉన్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ తెలిపారు. దేశంలో 96.7కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు అధికారులు చెబుతున్నారనీ, దాదాపు 73 శాతం పెద్దలు కనీసం ఒక డోస్‌ను వేయించుకున్నారనీ, దాదాపు 30 శాతం మందికి రెండు డోస్‌లు ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయన్నారు. అయితే చాలా దేశాలు 40 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయిందని వివరించారు. కరోనా మహమ్మారి వదల్లేదనీ, మూడో తరంగం ఆందోళన ఇంకా కొనసాగుతున్నదని గీత తెలిపారు. మహమ్మారి కారణంగా భారతదేశం ఆర్థిక మార్కెట్‌కు సంబంధించి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశం ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టాలన్నారు. ''చమురు ధరలు పెరుగుతున్నాయి, విద్యుత్ కోతలు, ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కానీ ముఖ్యమైనది మహమ్మారిపై దృష్టి పెట్టడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నదని ఆమె మోడీ సర్కార్‌కు హితవు పలికారు.