Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. బుధవారం విచారణలో ఎన్‌సిబి తన వాదనలు కొనసాగించింది. తరువాత విచారణ ను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కేసు విచారణ కొనసాగనుంది. ఆర్యన్‌ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని తమ విచారణలో వెల్లడైందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కోర్టుకు తెలిపింది. పట్టుబడిన సమయంలో అతడి వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభ్యం కాలేదని స్పష్టం చేసింది.