Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్తు అధికారుల వెల్లడి
అమరావతి :దేశంలో బొగ్గు కొరతతోనే రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి తగ్గి సంక్షోభం ఏర్పడిందని విద్యుత్ అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎపి జెన్కో మొత్తం సామర్థ్యం 5,010 మెగావాట్లు కాగా బొగ్గు కొరత వల్ల 2,300 నుంచి 2,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సెప్టెంబరులో సగటున రోజుకు 70వేల టన్నుల బొగ్గు అవసరం కాగా కొరత వల్ల 24వేల టన్నులే వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆభ్యర్థనతో సరఫరా 40వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. నిరంతరాయంగా కరెంటు సరఫరా కోసం యూనిట్ రూ. 15 నుంచి 20 వరకూ వెచ్చించి కొనుగోలు చేశామన్నారు. రెండేళ్లలో ప్రభుత్వం విద్యుత్తు సంస్థలకు రూ.34,340 కోట్లు విడుదల చేసిందని స్పష్టం చేశారు. ఏపీలో స్థాపిత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 18,533 మెగావాట్లు అయినప్పటికీ సరిపడినంత విద్యుత్తు ఉత్పత్తి కావడం లేదన్నారు. ఇందులో 8,075 మెగావాట్ల సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు ఉన్నా బేస్ లోడుకు సరిపడినంత విద్యుత్తు ఉత్పత్తి కావడం లేదన్నారు.