Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం సాయంత్రం 6.15 గంటలకు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎఐఐఎంఎస్)లో ఆయన చేరారు. ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో సెక్షన్లో మన్మోహన్ చేరినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. జ్వరం, నీరసం కారణాలతో ఎయిమ్స్‌లో చేరినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 89 ఏళ్ల మన్మోహన్ ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.