Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చఓటర్లకు ఓడిన అభ్యర్థుల బెదిరింపులు, దూషణలు
- చంపేస్తామని ఒకరు.. నీటి సరఫరాను అడ్డుకున్న మరొకరు
- 'పాత రోజులను' గుర్తు చేస్తున్న బీహార్ పంచాయతీ ఎన్నికలు
పాట్నా : బీహార్‌లో ఇటీవలే మూడు దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. గెలిచిన అభ్యర్థులు ఎవరో, ఓడిపోయిందెవరో తేలిపోయింది. కానీ, ఫలితాల తర్వాత గ్రామీణ బీహార్‌లో పరిస్థితులు మాత్రం పాత రోజులను గుర్తు చేశాయి. తమకు ఓటు వేయలేదని ఆరోపిస్తూ ఓడిపోయిన అభ్యర్థులు ఓటర్లపై బెదిరింపులకు దిగారు. వారిని పరుష పదజాలంతో దూషించారు. చంపేస్తామని హెచ్చరించారు. గ్రామాలకు అందే అవసరాలను కట్ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఓటర్లను బెదిరించిన ఈ తరహా ఘటనలు బీహార్‌లో పలు చోట్ల జరిగాయనీ స్థానిక మీడియా తెలిపింది.
'చంపేస్తామని బెదిరించాడు'
తూర్పు చంపారన్ జిల్లా సఫి పంచాయతీ పరిధిలోకి వచ్చే మంఝారియా గ్రామ ప్రజలను అక్కడి ఓడిపోయిన అభ్యర్థి పరాస్ చౌదరీ బెదిరిం చారు. తనకు ఓటు వేయకుండా మోసం చేశారని ఐదుగురు వ్యక్తులపై పరాస్ చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, దీనిపై దినేశ్ సింగ్ అనే గ్రామ స్థుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పరాస్ చౌదరీ తమను చంపుతామని బెదిరించారనీ, పరుష పదజాలంతో దూషించాడని దినేశ్.. తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తామంతా ప్రాణభయంతో ఉన్నామని చెప్పాడు. కాగా, దీనిపై దర్యాప్తు కొనసా గిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
గ్రామానికి వాటర్ సప్లరు కట్
ఓటమిని జీర్ణించుకోలేని ఒక అభ్యర్థి గ్రామానికి నీటి సరఫరాను బంద్ చేయించిన ఘటన ఇది. నవాడా జిల్లా నవాదిV్‌ా పంచాయతీకి చెందిన వినితా దేవీ వార్డు మెంబర్‌గా ఓడిపోయారు. దీంతో గ్రామానికి నీటి సరఫరా బంద్ అయ్యేలా చేయడంతో అక్కడి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఓటమికి ప్రతీకారంగానే వినితా, ఆమె భర్త రంజిత్ కుమార్‌లు తమ గ్రామానికి నీటి సరఫరాను ఆపేశారని గ్రామస్థులు ఆరోపించారు.
80 శాతం సిట్టింగ్‌లకు ఓటమి
బీహార్‌లో 11 దశల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు గత నెల మొదలయ్యాయి. ఇప్పటి వరకు మూడు దశల ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాయి. గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. గతంలో గెలిచినవారిలో దాదాపు 80 శాతం మంది ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. దీంతో ఇక్కడ కొత్త వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. పార్టీలు, పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఈ ఎన్నికల్లోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అక్కడి కఠిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.