Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జ్యుడీషియల్ అధికారులు పెరుగు శ్రీసుధ, చిళ్లకూర్ సుమలత, గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్, నూన్సావత్ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వరరెడ్డి, ఐటీఏటీ సభ్యురాలు పటోళ్ల మాధవి దేవిలకు పదోన్నతి కల్పిస్తూ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం సీజేఐ కాకుండా పది మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరి నియామకంతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరనున్నది.