Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారదర్శకతపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మదన్ లోకూర్ ఆందోళన
న్యూఢిల్లీ : పీఎం-కేర్స్ కింద జమ అయిన నిధులకు సంబంధించి పార దర్శకత విషయంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బి. లోకూర్ ఆం దోళన వ్యక్తం చేశారు. గతేడాది కరోనా ఆపత్కాల సమయంలో పీఎం-కేర్స్‌ను ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీనికి దేశవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి మొదలుకొని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు సంస్థల నుంచి నిధులు అందాయి. అయితే, నిధులు ఎంత మేర అందాయి? ఏ విధంగా ఖర్చు చేశారు? అన్న పలు అనుమానాలను దేశంలోని మేధావులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఇప్పటికే లేవనెత్తారు. తాజాగా పీఎంకేర్స్ నిధులపై జస్టిస్ లోకూర్ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. '' ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డొనేట్ చేశారన్నది మనకు తెలుసు. సీఎస్ఆర్.. పీఎంకేర్స్‌కు డైవర్ట్అయ్యింది. మరి పీఎం-కేర్స్ ఫండ్ కింద ఎంత డబ్బు ఉన్నదన్నది మన కు తెలియదు. ఇది ఎలా ఖర్చయ్యింది, ఎటు వెళ్లిందన్నదీ అనుమానాస్పదమే. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో భాగంగా వెంటిలేటర్ల కొనుగోలుకు నిధుల ఖర్చు జరుగుతుందన్న విషయం మనకు తెలి సింది. వాస్తవానికి జరిగిందేమిటన్నదీ మనకు తెలియదు'' అని మదన్ లోకూర్ అన్నారు. ఈ సందర్భంగా పీఎంకేర్స్ వెబ్‌సైట్‌లోని ఆడిట్ రిపోర్టుల సమాచారాన్ని ఆయన ప్రస్తావిం చారు. 2020-21కు సంబంధించిన ఆడిట్ రిపోర్టు ఇంకా సిద్ధం కావాల్సి ఉన్నదనీ, ఈ నివేదికలకు సంబంధించిన క్లూ ఎవరి వద్దా లేదని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం భారత్‌లోకి వచ్చి 16 ఏండ్లు పూర్తైన సందర్భంగా నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఎన్సీపీఆర్ఐ) ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదన్ లోకూర్.. ఆర్టీఐ చట్టంపై లెక్చర్ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.