Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై ఈ నెల 20న కోర్టు తీర్పును వెల్లడించనుంది. బెయిల్ పిటీషన్‌పై గురువారం ఎన్‌సిబి వాదనలు, ఆర్యన్ ఖాన్ లాయర్ వాదనలు విన్న ఎన్డిపిఎస్ ప్రత్యేక కోర్టు జడ్జి వివి పాటిల్ తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. ఈ నెల 20న వెల్లడించనున్నారు. దీంతో ఆర్యన్‌ను తిరిగి జైలుకు తరలించారు. ఆర్యన్‌తో పాటు అర్బాజ్, మూన్‌మూన్ ధామేచాల బెయిల్ పిటిషన్‌పై గురువారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇప్పటికే మేజిస్ట్రేట్ కోర్టు ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే.