Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల : తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణ గురువారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. సుప్రీంకోర్టు జస్టిస్ హిమకోహ్లి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, రిజిస్ట్రార్ జనరల్ భానుమతి, రిజిస్ట్రార్ గిరిధర్, చిత్తూరు జిల్లా జడ్డి పార్థసారధి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సిజెఐకు స్వాగతం పలికారు. సాయంత్రం 5.35కు పద్మావతి అతిథి గృహం చేరుకున్నారు. టిటిడి ఇఒ, అధికారులు స్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.