Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాటియాల : పంజాబ్‌లో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రతరమైంది. రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో యూనిట్లను మూసివేశారు. మొహబ్బాత్, తల్వండి సబో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒక్కొక్క యూనిట్లో ఉత్పత్తిని గురువారం ఉదయం నుంచి నిలిపివేశారు. ఇప్పటికే ఈ రెండు కేంద్రాల్లోనూ ఒక్కొక్క యూనిట్‌ను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ తలండి సబో కేంద్రంలో రెండు యూనిట్లు, లెహ్రా మొహబ్బాత్లో రెండు యూనిట్లు, రోపర్ కేంద్రంలో ఒక యూనిట్‌ను మూసివేసినట్లయిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.