Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఇందిరా గాంధీ అనేక సంవత్సరాలు దేశానికి నేతృత్వం వహించడమే కాదని, యుద్ధ సమయాల్లోనూ దేశాన్ని ముందుకు నడిపించారని ఆయన ప్రశంసించారు. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో ఆమె పాత్ర గురించి మంత్రి స్పష్టంగా ప్రస్తావించారు. 'సాయుధ బలగాల్లో మహిళల పాత్ర'పై జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) సెమినార్లో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాణీ లక్ష్మీభారు, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. జాతీయ అభివృద్ధిలో మహిళాశక్తిని సద్వినియోగం చేసుకోవడంలో భారత్‌కు సానుకూల అనుభవం ఉందని అన్నారు. దేశాన్ని రక్షించడానికి, ప్రజల హక్కులను కాపాడటానికి మహిళలు ఆయుధాలు ధరించిన ఉదాహరణలు చరిత్రలో అనేకం ఉన్నాయని అన్నారు. ప్రస్తుత కాలంలో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల నిర్వహణలోసైతం మహిళలు భాగస్వాములవుతున్నారని చెప్పారు.