Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) రెండంకెల స్థాయిలోనే కొనసాగుతుంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో ఈ సూచీ 10.66 శాతంగా నమోదయ్యింది. ఇంతక్రితం ఆగస్టులో 11.39 శాతంగా ఉంది. 2020 సెప్టెంబర్లో 1.32 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన సెప్టెంబర్లో ముఖ్యంగా లోహాలు, అహారేతర ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు, రసాయనాల ధరలు పెరిగినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆహారోత్పత్తుల ధరలు మాత్రం వరుసగా ఐదో మాసంలోనూ తగ్గినట్టు తెలిపింది. మరోవైపు పప్పుల ధరలు మాత్రం 9.42 శాతం ఎగిశాయి. ముడి చమురు, సహజ వాయువు ధరలు వరుసగా 43.92 శాతం పెరిగాయి. ఇంతక్రితం మాసంలో ఇది 40.03 శాతం పెరిగాయి. తయారీ ఉత్పత్తుల ధరలు 11.41 శాతం పెరిగాయి. దీంతో వచ్చే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ వడ్డీ రేట్ల తగ్గింపు కష్టసాధ్యం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.