Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో ఇటీవల వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శనివారం పుల్వామా జిల్లాలోని పంపోర్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. వీరిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటుచేసుకున్న ఇద్దరు పోలీసు అధికారుల హత్య కేసులో ప్రమేయం ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖాందే కూడా ఉన్నాడని ఐజిపి విజరుకుమార్ వెల్లడించారు. తాజా మృతులతో ఈనెల 8 తర్వాత భద్రతా బలగాలు నిర్వహించిన పలు ఎన్కౌంటర్లలో మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. కాశ్మీర్ లోయలో ఇటీవల వేర్వేరు ఘటనలో ఏడుగురు పౌరులు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనల తర్వాత భద్రతా బలగాలు, పోలీసులు ఉగ్రవాదుల కోసం సోదాలు తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఆచూకీకి సంబంధించి నిఘా వర్గాల సమాచారం మేరకు ఎన్కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి.