Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోయంబత్తూర్ : ఒక్క విమానం వెళ్తుంటే..ఎంతో ఆసక్తిగా చూస్తాం. అలాంటి ఒక వరుసలో పక్షుల్లా యుద్ధవిమానాలు ఎగురుతుంటే..అలాంటి అద్భుత దృశ్యాన్ని తిలకించే అవకాశం అరుదుగా లభిస్తుంది.తాజాగా భారత వాయుసేన(ఐఏఎఫ్) మొదటిసారిగా 14 తేజస్ యుద్ధ విమానాలు ఓ నిర్దిష్ట క్రమంలో వెళ్లేలా ఏర్పాటు చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఈ ఫొటోలను ఐఏఎఫ్ ట్విటర్లో షేర్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.