Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పార్క్ హయాత్ పేరు మనం వినే వుంటాం. భారత దేశంలోని అనేక నగరాల్లో హయాత్ పేరుతో హోటల్స్‌ను నిర్వహిస్తున్నారు రాధేశ్యామ్ సారఫ్. ఈయన సంపాదించిన సంపదనంతా దొడి ్డదారిలో తీసుకెళ్లి పన్ను ఎగవేతదారులకు స్వర్గసీమ అయిన మధ్య అమెరికాలోని బెలీచేలో భద్రంగా ట్రస్టుల్లో దాచి పెట్టారు. అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల బృందం బయట పెట్టిన పండోరా పత్రాల్లో ఈయన బండారం అంతా బయటపడింది. ఈయన తరతరలుగా వస్తున్న ఆస్తిని సంరక్షించుకోవాలనే పేరుతో ఇద్దరు కోడుకులకు ఒక్కొక్కటి చొప్పున బెలీచేలో ట్రస్టులను ప్రారంభించారు. వాటిలోకి తమ సంపదనంతా పంపించారు. ఈ విషయాన్ని ఆ ట్రస్టులను మేనేజ్ చేస్తున్న సంస్థలే దృవపరిచాయి. ఆ ట్రస్టుల్లో తాను, తన భార్య వ్యవస్థాపకులుగా ఉన్నారు. తామిద్దరూ భారత్ పౌరులమేనని స్పష్టం చేశారు. కానీ జర్నలిస్టుల బృందం ఈ ట్రస్టులపై రాధేశ్యామ్ సారఫ్ ను ప్రశ్నించగా తనకు ఇప్పుడు 92 సంవత్సరాలని, ఐదు దశాబ్దాలుగా తాను ప్రవావస భారతీయుడిగా హంకాంగ్‌లో ఉంటున్నానని, తన ఆస్తులను వారసులకు ఇవ్వడం తప్పా అంటూ ప్రశ్నించారు.