Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్టీల్ వ్యాపార దిగ్గజం ఎల్ఎన్ మిట్టల్ తమ ప్రమోద్ మిట్టల్ తనకున్న ఆస్థిని తనది కాదు అంటున్నాడు. ఎందుకుంటున్నాడు అంటే తన పేరు మీద ఉన్న రెండు లక్షల కోట్ల అప్పులను ఎగ్గొట్టడానికని పండోరా పేపర్స్‌లో తేలింది. దాదాపు 20 మంది అప్పుదారులకు ప్రమోద్ మిట్టల్ రెండు లక్షల ఐదు వేల కోట్ల రూపాయల బకాయి ఉన్నాడు. కానీ తన వద్ద 35 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని, వాటితోనే సరిపెట్టుకోవాలని రుణదాతలకు చెప్పేశాడు. అందుకోసం బ్రిటన్ చట్టాల ప్రకారం దివాళా తీసినట్లు ప్రకటించారు. కానీ పండోరా పేపర్లలో తేలిందేమంటే బ్రిటిష్ వర్జిన్ ఐస్లాండ్స్లో తాను నెలకొల్పిన డైరెక్ట్ ఇన్వెస్టెమెంట్ లిమిటెడ్ అనే కంపెనీకి మరో తన కంపెనీ అయిన, బ్రిటన్‌లోని తన ఇంటి నివాసంలో ఏర్పరిచిన మీడ్స్వెల ఎస్టేట్స్ లిమిటెడ్ కంపెనీ 90 వేల కోట్ల రూపాయలను బకాయి పడిందని చెప్పుకుంటున్నాడు. అంటే ఇంటి అడ్రస్‌లో ఉన్న తన కంపెనీ విదేశాల్లో తానే నెలకొల్పిన మరో కంపెనీకి బకాయి పడి ఉంది కాబట్టి ఆ ఆస్థి తనది కాదని తన రుణదాతలను మిట్టల్ తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఒకవైపు రుణాలు కట్టలేక దివాళా తీశానంటునే మరోవైపున ఆ డబ్బునంతా బ్రిటీష్ వర్జిన్ ఐస్లాండ్స్లో ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీకి మళ్లించేశాడు.