Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల బృందం బయట పెట్టిన పండోరా పత్రాల ప్రకారం ఐపిఎల్ జట్లు అయిన రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లలో విదేశాలకు చెందిన డొల్ల కంపెనీలు పెట్టుబడి పెట్టిన వెల్లడైంది. ఐపిఎల్ స్థాపించిన ఒకప్పటికి బిసిసిఐ ప్రతినిధి లలిత్ మోడీ ఆ తర్వాత ఆర్ధిక నేరాలు చేసినట్లు రూఢ అయ్యిన సంగతి తెలిసిందే. లలిత్ మోడీ తన డబ్బునే తన బంధువుల డబ్బుగా ఐపిఎల్ జట్లలో పెట్టుబడిగా పెట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. పండోరా పేపర్స్ ద్వారా ఆ ఆరోపణలు నిజమని తేలాయి. పంజాబ్ కింగ్స్‌లో పెట్టుబడి పెట్టిన గౌరవ్ బర్మన్ లలిత్ మోడీ కూతురుకు స్వయనా భర్తే. ఇక రాజస్థాన్ రాయల్స్‌లో పెట్టుబడి పెట్టిన సురేష్ చెల్లారామ్ లలిత్ మోడీ సడ్డుగుడు కావడం విశేషం. వీరిద్దరూ కూడా బ్రిటన్ పౌరులుగా ఉన్నారు. లలిత్ మోడీ తన డబ్బును వీరి ద్వారా పన్ను ఎగవేత దారులకు స్వర్గధామంగా ఉండే బ్రిటీష్ వర్జిన్ ఐస్‌ల్యాండ్స్‌లో కంపెనీలు పెట్టించాడు. వాటి ద్వారా ఐపిఎల్‌లో పెట్టుబడి పెట్టారు.
కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన పండోరా పత్రాలు పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల బృందం కోటీ 19 లక్షల పత్రాలను వెలుగులోకి తెచ్చింది. ఇందులో దాదాపు 35 మందికిపైగా వివిధ దేశాధినేతల, వందకు పైగా పారిశ్రామిక వేత్తలు, సినీ, క్రీడా రంగ ప్రముఖులు విదేశాల్లో కల్గిఉన్న డొల్ల కంపెనీల జాబితా ఉంది. వీరంతా వారి వారి దేశాల్లో అక్రమంగా సంపాదించిన సోమ్మును పన్నులు చెల్లించకుండా పన్ను ఎగవేత స్వర్గ సీమలైన బ్రిటీష్ వర్జిన్ ఐస్‌ల్యాండ్స్ లాంటి దేశాల్లో ట్రస్టులను సృష్టించి వాటికి డబ్బును మళ్లించారు. అక్కడ నుండి చట్టబద్దంగా మళ్లీ దేశంలోకి వేర్వేరు రూపాల్లో తీసుకొచ్చి సొమ్ము చేసుకున్నారు. భారత దేశానికి సంబంధించిన ప్రముఖుల వ్యవహారాలను అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల బృందంలో సభ్యురాలిగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన వెబ్సైట్లోనూ, పేపర్లోనూ వరస కధనాలను అందించింది. ఆ కథనాలనే అనువదించి ప్రజాశక్తి మీకు అందిస్తోంది.