Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిఆర్ శెట్టికి విదేశాల్లో లెక్కకుమించి డొల్ల కంపెనీలు
న్యూఢిల్లీ: కొన్నేళ్ల క్రితం బిఆర్ శెట్టి అంటే అతిపెద్ద కోటీశ్వరుడు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరు. ఆయన సంపద విలువ దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు. కర్నాటక నుంచి యుఎఇకి వలస వెళ్లి భారీ స్థాయి వైద్య వ్యాపారాన్ని నిర్మించిన పారిశ్రామికవేత్తగా ఆయనకు పెద్ద పేరు. కానీ ఆయన స్థాయికి మించి అప్పులు చేశారు. దేశీయ, విదేశీ బ్యాంకులకు కలిపి ఆయన దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలను బకాయి పడ్డారు. దీంతో ఎవ్వరికీ అప్పులు చెల్లించలేక దివాళా తీసాడు. యుఎఇ, బ్రిటన్‌లో ఉన్న ఆస్తులను అక్కడి ప్రభుత్వాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. భారత్‌లోనూ బ్యాంక్ ఆఫ్ బరోడాకు రెండు వేల కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 850 కోట్ల రూపాయాలను బకాయి పడ్డారు. బిఆర్ శెట్టి ఈ చెల్లింపులు చేయకపోవడంతో బ్యాంకులు విచారణ సంస్థలను ఆశ్రయించాయి. దీంతో ఆయనకు భారత ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తన తమ్ముడి ఆరోగ్యం బాగాలేకపోవడంతో భారత్‌కు వచ్చిన ఆయన్ను అధికారులు తిరిగి యుఎఇకి వెళ్లనివ్వలేదు. ఆయన భారత్‌లోనే ఆగిపోయాడు. కానీ పండోరా పేపర్స్ ద్వారా తేలిన విషయమేమంటే ఈయనకు పన్ను ఎగవేత దారులకు స్వర్గధామమైన బ్రిటీష్ వర్జీన్ ఐస్‌ల్యాండ్స్‌లో ఈయనకు లెక్కకు మించి డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఈ డొల్ల కంపెనీలన్నీ బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఆయన కంపెనీ ట్రావెలెక్స్ హోల్డింగ్స్‌లో షేర్లను కోనుగోలు చేశాయి. ట్రావెలెక్స్ హోల్డింగ్స్ కంపెనీ కింద దాదాపు 81 కంపెనీలు స్విట్జర్లాండ్, పనామా, బ్రెజిల్, చైనా, జపాన్లతోపాటు అమెరికా, బ్రిటన్‌లో కూడా ఉన్నాయి. ఈయనకు బ్రిటీష్ వర్జీన్ ఐస్లాండ్స్లో బ్రేవ్ సిటి ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీకి సంబంచిన డబ్బు తీయడానికైనా, వాడడానికైనా, అధికారులతో మాట్లాడానికైనా, దీని కింద ఏర్పాటు చేసే ఇత ర కంపెనీలను మూసివేయడానికైనా బిఆర్ శెట్టికి పూర్తి అధికారాలు ఉన్నాయి. ఇలాంటి డొల్ల కంపెనీలను ఎన్నో బిఆర్ శెట్టి సృష్టించారు. వాటిల్లో డైరెక్టర్లగా తన భార్య, కొడుకు, అన్న, బావమరుదు లను పెట్టారు. వివిధ విదేశీ, స్వదేశీ బ్యాంకుల నుంచి పొందిన దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులను ఈ డొల్ల కంపెనీలకు తరలించాడు. దొంగచాటుగా ఆస్తులు కూడబెట్టాడు. కానీ బ్యాంకులకేమో తనకున్న పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించడం లేదు. వెల్లడిస్తే అప్పుల కింద మొత్తం కట్టాల్సి ఉంటుంది.