Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్ ఇండియాను నిర్వీర్యం చేసే కుట్ర : బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభం సదస్సులో వక్తలు
విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వమే బొగ్గు కొరతను సృష్టించిందని, విద్యుత్ చార్జీలు పెంచడం కోసం టాటా, అదానీలు తమ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. బొగ్గు కొరత సృష్టి వెనుక కోల్ ఇండియాను ప్రయివేటుపరం చేయాలన్న ప్రభుత్వ కుట్ర దాగుందన్నారు. శనివారం విశాఖ పౌరగ్రంథాలయంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు అధ్యక్షతన జరిగిన 'బొగ్గు కొరత- విద్యుత్ సంక్షోభం' సదస్సులో ప్రముఖ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వర్చువల్ (జూమ్‌కాల్) విధానంలో ప్రసంగించారు. కోల్ ఇండియాను ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వం బొగ్గు బ్లాకులు కేటాయించడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారం విద్యుత్ ఉత్పత్తికయ్యే ఖర్చు వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారని పేర్కొన్నారు. బొగ్గు సంక్షోభం విద్యుత్ చార్జీలు పెరగడానికి దారితీస్తాయన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించక పోవడం, కోల్ ఇండియాకు బొగ్గు బ్లాకుల్ కేటాయిం చకపోవడం వెనుక వాటిని అమ్మకానికి పెట్టాలన్న కుట్ర దాగుందని పేర్కొన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపం చంలో నాలుగో స్థానంలో వున్న భారత్‌లో బొగ్గు సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 3.90 లక్షల మెగావాట్లకు, 1.70 లక్షల మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందన్నారు. అవసరానికి సరిపడా బొగ్గు నిల్వలను ప్రయివేటు విద్యుత్ కంపెనీలు దగ్గర ఉంచుకోవడం లేదన్నారు. కోల్ ఇండియా విస్తరణ కంటే దాన్ని నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతుందని విమర్శించారు. ప్రభుత్వ రాజకీయ విధానం అర్థం చేసుకొని ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి, అవగాహన కల్పించాలన్నారు. విశ్రాంత ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి దూరదృష్టి, ప్రణాళికలేకపోవడమే బొగ్గు సమస్యకు కారణ మన్నారు. ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించి ఎపి జెన్కో సామర్ధ్యాన్ని తగ్గిస్తూ వస్తుందని తెలిపారు. రాయితీలు పొందిన ప్రయివేటు కంపెనీలు ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి విద్యుత్ కేటాయించకుండా, ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్న వాటిపై రాష్ట్ర ప్రభుత్వం జరిమాన వేయకపోవడం విచారకరమన్నారు. సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ.. వర్షకాలం వల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ప్రజలను మోసగిస్తోందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడం కోసం టాటా, అదానీలు తమ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేశారని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా ప్రయివేటు కంపెనీలు లాభపడేందుకు బొగ్గు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నా రని తెలిపారు. ఒప్పందం ప్రకారం గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్‌కు గ్యాస్ సరఫరా చేయకుండా ఇతర రాష్ట్రాలకు అంబానీ తరలిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపడం లేదన్నారు. ప్రయివేటు సంస్థల చేతుల్లో బొగ్గు గనులను పెడితే విద్యుత్ చార్జీలు భారీగా పెరుగుతాయన్నారు.