Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ సీఎంలు, అదానీ, అంబానీ, కేంద్ర మంత్రులవి కూడా..
- ఇంధన ధరలు తగ్గించాలి : ఎస్‌కెఎం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షాలతో సహా బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అదానీ, అంబానీల దిష్టి బొమ్మలను దహనం చేశారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరాను పురస్కరించుకొని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపులో భాగంగా అక్టోబర్ 15,16 తేదీల్లో దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాతో సహా బీజేపీి పాలిత రాష్ట్రాల ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, మనోహర్‌లాల్ ఖట్టర్, శివరాజ్‌సింగ్ చౌహాన్, పుష్కర్ సింగ్ థమిలతో పాటు కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల మంత్రులు, కార్పొరేట్లు అదానీ, అంబానీల దిష్టి బొమ్మలను తగులబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు ఎస్‌కెఎం నేతలను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధం గావించారు. అయినప్పటికీ వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. యూపీిలోని అణచివేతను ఎస్‌కెఎం ఖండించింది. మధ్యప్రదేశ్‌లో గుణతో పాటు ఇతర ప్రాంతాల్లో దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్న రైతులను పోలీసులు బలవంతంగా నిరోధించారు. మహారాష్ట్రలో ఎఐకెఎస్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, అమిత్ షా, యోగి, మిశ్రాలతో పాటు ఇతర బిజెపి నేతల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. తమిళనాడులోని కరూర్‌లో రైతులు దిష్టిబొమ్మ దగ్ధం చేయకుండా బీజేపీ కార్యకర్తలు నిరోధించడానికి ప్రయత్నించారు. ఎస్‌కెఎం కార్యకర్తలతో ఘర్షణకు ప్రయత్నించారు. ఒరిస్సాలోని అనేక ప్రదేశాలు ఆందోళనలు జరిగాయి. పంజాబ్ అంతటా వందలాది ప్రదేశాలలో దిష్టి బొమ్మల దగ్ధం జరిగింది. హర్యానా వ్యాప్తంగా దిష్టి బొమ్మల దగ్ధం జరిగింది.
సింఘూ సరిహద్దు వద్ద మంటలు
సింఘూ సరిహద్దు వద్ద మంటలు చెలరేగాయి. అందులో అనేక గుడారాలు దగ్ధమయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అప్రమత్తం అయిన రైతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనేక రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కిసాన్ మహా పంచాయతీలు జరుగుతున్నాయి. శనివారం కిసాన్ మహాపంచాయత్లోని రోV్ాతక్లో భారీగా జరిగింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని జీరాలో వేలాది మంది రైతులతో కిసాన్ మహా పంచాయత్ జరిగింది. హౌషియార్పూర్లో ముకేరియన్ హర్సా-మన్సార్ టోల్ ప్లాజా వద్ద కూడా మహాపంచాయత్ నిర్వహించారు. ఇందులో పంజాబ్ రైతులు కాకుండా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రైతులు పాల్గొన్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా (జోయ రోడ్‌లోని జోరు కే మైదాన్)లో ఒక భారీ మహాపంచాయత్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రి బల్దేవ్ సింగ్ లక్నోలో రైతులు నిరసనను ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా రైతులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో రైతుల ఆందోళన కారణంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఇంధన ధరలు తగ్గించాలి : ఎస్‌కెఎం
ఇంధన ధరలు మళ్లీ పెరిగాయని, డీజిల్ లీటరుకు రూ.100 దాటిందని, పెట్రోల్ లీటర్ రూ .110 దాటిందని, వంటగ్యాస్ సిలిండర్‌కి రూ .1000 దగ్గర ఉందని ఎస్‌కెఎం పేర్కొంది. ప్రభుత్వం ఇంధన ధరలను వెంటనే సగానికి తగ్గించాలని, బ్లాక్-మార్కెటింగ్ చేయడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఎరువుల సరఫరా కోసం ఏర్పాట్లు చేయాలని ఎస్‌కెఎం డిమాండ్ చేసింది.