Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రారంభమైన రెండు నెలల్లోనే ఈ-శ్రమ్ పోర్టల్‌లో నాలుగు కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు నమోదయ్యారని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకునే అసంఘటిత కార్మికులు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులవుతారని మంత్రి ఆదివారం చెప్పారు. దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల సమాచారం తెలుసుకునేందుకు ఆగస్టు 26న ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఆదివారం ఉదయానికి ఈ పోర్టల్‌లో 4.15 కోట్ల మంది నమోదయ్యారు. ఇందులో 50.2 శాతం మహిళా కార్మికులని, మిగిలిన 49.98 శాతం పురుషులని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 43 శాతం కార్మికులు ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారని, 27 శాతం జనరల్ కేటగిరి అని, 23 శాతం ఎస్సీ, 7 శాతం మంది ఎస్టీలని తెలిపింది.