Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమయమివ్వండి : సోనియాకు సిద్ధూ లేఖ
చండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోపై చర్చించేందుకు అవకాశమివ్వాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆ పార్టీ పంజాబ్ అధ్యక్షులు నవజోత్ సింగ్ సిద్ధూ లేఖ రాశారు. రాష్ట్రంలో 2022లో జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ మ్యానిఫెస్టో కోసం 13 పాయింట్ల ఎజెండాను అందులో పొందుపర్చారు. భేటీకి అవకాశమివ్వాలని సోనియాను కోరారు. సిద్ధూ తన లేఖలో మాదక ద్రవ్యాల సమస్య, వ్యవసాయ సమస్యలు, ఉద్యోగావకాశాలు, విద్యుత్, పిపిఎ, వెనుకబడిన తరగతుల సంక్షేమం, సింగిల్ విండో పారిశ్రామిక విధానం, మహిళా సాధికారత, మద్యం, ఇసుక తవ్వకాలు, రవాణా, కేబుల్ మాఫియా.. ఇలా మొత్తం 13 అంశాలను పొందుపరిచారు. ఆయా రంగాల్లో చేయాల్సిన కృషిపై వివరించారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వివరించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ నెల 15న సిద్ధూ ఈ లేఖ రాశారు.