Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి రాందాస్ అథవాలే
విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్డీఏలో చేరాలని కేంద్ర సామాజిక, న్యాయం, సాధికారిత శాఖా మంత్రి రాందాస్ అథవాలే కోరారు. ఎన్డీఏలో చేరితే రాష్ట్రంలోని జాతీయ రహదారులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మేలు జరుగుతుందన్నారు. మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని తెలిపారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో 15 ఏండ్లు వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకొనే అవకాశం లేదన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పీఓకే వదిలి వెళ్లాలన్నారు. పీఓకే వీడితేనే భారత్, పాక్ మధ్య స్నేహం కొనసాగుతుందని పేర్కొన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా రెండున్నర లక్షల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బి.అనీల్‌కుమార్, ఏపీ, తెలంగాణ ఇన్ఛార్జ్ బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.