Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగిలో కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు గిరిజనులు గాయపడ్డారు. అయితే ఈ కాల్పులపై భిన్న కథనాలు వినిపి స్తున్నాయి. గంజాయి కేసుకు సంబం ధించి తెలంగాణ పోలీసులు నింది తులను పట్టుకునేందుకు వచ్చారు. లోతుగెడ్డ సమీపంలో నిందితులను గుర్తించి మధ్యవర్తుల ప్రమేయంతో చర్చలు జరిపి తొలుత వెనక్కు వెళ్లిపోయారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఎలాగైనా నిందితులను తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు మళ్లీ వెనక్కి వెళ్లి చింతపల్లి సమీపంలో నిందితులను అడ్డుకున్నారు. నిందితులు ఎదురు దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరపగా ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు కొందరు చెబుతున్నారు. ఇదిలా ఉండ గా మరో కథనం ప్రకారం..చింతపల్లి నుంచి నర్సీపట్నం వరకు గంజాయి తరలి స్తున్న వ్యాన్ను చింతపల్లి- నర్సీపట్నం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గంజాయి స్మగ్లర్లు ఎదురు తిరగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. మరికొందరు గంజాయిని తరలించేందుకు కొందరు దుండగులు గిరిజనులను తీసుకెళ్లారని విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని అడ్డుకున్నారని దీంతో దుండగులు కాల్పులు జరిపారని చెబుతున్నారు.