Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ సదస్సులో హిందూపుం ఎంఎల్ఏ బాలకృష్ణ
హిందూపురం: రాయలసీమకు నీటికోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని టీడీపీ హిందూపుం ఎంఎల్ఏ బాలకృష్ణ ప్రకటించారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై అనంతపురం జిల్లా హిందూపురంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు రాయలసీమ జిల్లాలకు చెందిన టీడీపీి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే తప్ప రాయలసీమకు నీరిచ్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉన్నా రాయలసీమ జిల్లాలు దుర్భిక్షంలోనే ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో దీనికి భిన్నంగా ఉండేదని చెప్పారు. ఎన్టి రామారావు హంద్రీనీవా పథకాన్ని తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆ పథకం ద్వారా చెరువులకు నీరిచ్చే ఆలోచన ప్రభుతం చేయడం లేదన్నారు. ఈ పరిస్థి తుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని రకాల పోరాటాలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఖరి వల్ల సీమకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి మాట్లాడుతూ సీమ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. కృష్ణానదిపై ప్రాజెక్టులన్నింటికి బోర్డుకు అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం కూడా సీమకు శాపంగా మారుతుందన్నారు. దీనివల్ల సీమ ప్రజల అవసరాలు పరిగణలోకి రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. జూరాల ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో మొత్తం 20 అంశాలతో తీర్మానం చేశారు.