Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ అధినేత అఖిలేశ్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా వంద మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపారని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ గుర్తు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన బిజెపి తన సిట్టింగ్ ఎమ్మెల్యేలు 150 మందికి తిరిగి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికే తమకు 50 మంది ఎమ్మెల్యేలున్నారని, వచ్చే ఏడాది ఎన్నికల్లో 300 స్థానాలను గెలుపొందుతామని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ దిగజారడంపై మోడీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సృష్టించగల శక్తి ఉన్నప్పటికీ ఆకలి సూచీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కన్నా వెనుకబడి ఉన్నామని అన్నారు. పోషకార లేమితో బాధపడుతున్న వారు రాష్ట్రంలో అధికంగా ఉన్నారని చెప్పారు. ఈ గణాంకాలు బీజేపీ ప్రభుత్వం తప్పుడు మార్గంలో నడుస్తుందని చెబుతున్నాయని అన్నారు. కుల గణన చేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. మోడీ, యోగి ప్రభుత్వాలు ఏం చేయకుండానే.. చాలా చేశామని చెప్పుకుంటున్నాయని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాల దిశను నిర్ణయిస్తాయని, ఇది ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయమని పేర్కొన్నారు.