Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బొగ్గు కొరత కారణంగా దేశంలోని అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని మూతపడే స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఉత్తరభారతంతో పాటు దేశంలోని చాలా ప్రాంతాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దేశంలో బొగ్గు ఉత్పతి సమస్య గురించి ముందే హెచ్చరికలు అందిన పట్టించుకోలేదని ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ఆగస్టు నెలలో భారత బొగ్గు దిగుమతులు 2.7 శాతం క్షీణించి 15.22 మిలియన్ టన్నులకు పడిపోయిందని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.గతేడాది ఇదే నెలలో భారత్ 15.64 మెట్రిక్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంది.బొగ్గు పరిస్థితులపై ఎంజంక్షన్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ వినరు వర్మ మాట్లాడుతూ.. సముద్ర తీర బొగ్గు ధరలు స్థిరంగా పెరగడానికి ఉత్పత్తులు తగ్గడంమేనని పేర్కొన్నారు. అయితే, ప్రస్తు తం దేశంలో విద్యుత్ రంగం నుంచి తీవ్రంగా డిమాండ్ పెరుగుతున్నదని అన్నారు. ''అంతర్జాతీయ ధరల అస్థిరతను బట్టి, దిగుమతులపై ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో వేచిచూడాల్సిన అవసరముంది'' అని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో మొత్తం దిగుమతిలో కోకింగ్ కాని బొగ్గు 9.08 మెట్రిక్ టన్నులుగా ఉంది. గతేడాది ఆగస్టులో దిగుమతి చేసుకున్న 10.33 మెట్రిక్ టన్నులకు వ్యతిరేకంగా ఉంది. కోకింగ్ బొగ్గు దిగుమతులు 4.37 మెట్రిక్ మెట్రిక్ మీటర్ల వద్ద ఉన్నాయి. ఇది గతేడాది ఆగస్టులో 3.17 మెట్రిక్ మెట్రిక్ మీటర్లుగా ఉంది. ప్రధాన, ప్రధానేతర ఓడరేవుల ద్వారా బొగ్గుదిగుమతులు జులైతో పోలిస్తే ఆగస్టులో 6.71 శాతం తగ్గినట్టు అంచనా. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా.. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు ఆకాశాన్నంటడం వల్ల వినియోగదారులందరూ దేశీయ బొగ్గుకోసం పోటిపడుతున్నారనీ, దీంతో డిమాండ్ సైతం రికార్డు స్థాయిలో పెరిగిందని పేర్కొంది. అయితే, దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం దిశగా ముందుకు సాగుతున్న పరిస్థితులుండగా.. కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి కొన్ని గనులను మూసివేయడం, రుతుపవనాల కారణంగా మరికొన్ని మునిగిపోవడంతో సంక్షోభానికి దారితీసిందనీ, అయితే పరిస్థితి మెరుగుపడుతున్నందున భయపడాల్సిన అవసరం లేదని పేర్కొనడం గమనార్హం.