Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సాధారణంగా పెట్రోలు ధర విమాన ఇంధన రేటు కన్నా తక్కువగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం దేశంలో దానికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. పెట్రోలు, డీజల్ ధరలు విమాన ఇంధన రేట్లను మించి దూసుకుపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో విమానాలకు వాడే ప్రత్యేక ఇంధనం (ఎవియేషన్ ట్రిబ్యూన్ ఫ్యూయల్ -ఎటిఎఫ్/ జెట్ ఫ్యూయల్ ) రేటు ఆదివారం నాడు లీటర్‌కు 79 రూపాయలు (కిలోలీటర్‌కు రూ.79,020.16)గా ఉండగా పెట్రోలు ధర 105.84 రూపాయలకు చేరింది. ఇది విమాన ఇంధనంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ! సాధారణ ప్రజలు వాడే పెట్రోలు, డీజల్ ధరలు ఈ స్థాయికి పెరగడం నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియచేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్త్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలతో సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఆదివారం నాడు కూడా. పెట్రోలు, డీజల్ ధర పెరిగింది.