Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర
- లీటర్‌కు రూ.40 అదనంగా జేబులకు చిల్లు
- ఆగని ఇంధన ధరల మంట
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ.110 కి చేరింది. గతంలో లీటర్ ధర రూ. 80 ఉంటే..వరుసగా ఇంధనధరల్ని పెంచటంతో.. ఇపుడు రూ.40 పెరిగి రికార్డ్ స్థాయికి చేరింది.యాక్టివా లాంటి వాహనాలకు రూ.300 ఇస్తే..ట్యాంక్ ఫుల్ అయ్యేది. ఇపుడు రూ.450కిపైనే అవుతున్నది. ఇక డీజిల్ ధర రూ.100.37కు పెరిగింది. దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతున్నది. గత కొన్నిరోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులతో పాటు సామాన్యులపై కూడా భారం పెరుగుతోంది. శనివారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్‌పై వరుసగా నాలుగో రోజూ వినియోగదారులపై మరో 35 పైసలు వడ్డించాయి. దీంతో దేశరాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.84కి పెరుగగా, డీజిల్ ధర రూ.94.57కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 111.77కు, డీజిల్ ధర రూ.102.52కు పెరిగాయి. మెట్రోనగరాలైన కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.3, డీజిల్ రూ.97.68, చెన్నైలో పెట్రోల్ రూ.103.01, డీజిల్ రూ.98.92 చేరాయి. బెంగళూరులో పెట్రోల్ రూ.109.53, డీజిల్ రూ.100.37కు పెరిగింది. కాగా, పెట్రోల్ ధరల మంటలు రోజురోజుకూ కొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి. ఈ నెలలో గడిచిన 16 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.4.43, డీజిల్ ధర లీటరుపై రూ.5.11లు అధికమయింది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగుదల.. నిత్యావసరాల ధరలు సైతం పెరుగుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. చమురుపై విధిస్తు పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.