Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో రెట్టింపు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది జులై నుంచి సెప్టెంబర్ కాలంలో దేశంలోని ఎనిమిది కీలక నగరాల్లో గృహ అమ్మకాలు 59 శాతం పెరిగి 55,907 యూనిట్లుగా నమోదయ్యాయని ప్రాప్‌టైగర్.కమ్ ఓ రిపోర్ట్‌లో వెల్లడడించింది. ఇంతక్రితం త్రైమాసికంతో పోల్చితే అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని పేర్కొంది. గతేడాది ఇదే జులై సెప్టెంబర్ కాలంలో 35,132 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో 15,968 యూనిట్లు నమోదయ్యాయి. తక్కు వ వడ్డీ రేట్లు, చౌక గృహాల సంఖ్య పెరగడంతో అమ్మకాలు పుంజుకున్నాయని హౌజింగ్.కమ్ గ్రూపు సిఇఒ దృవ్ అగర్వాల్ పేర్కొన్నారు. గడిచిన త్రైమాసికంలో హైదరాబాద్‌లో అమ్మకాలు రెట్టింపై 7,812 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే కాలంలో 3,260 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత పెరగడం, గహ రుణాలపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి తగ్గిపోవడం వంటి అంశాల ఊతంతో గృహ అమ్మకాలకు డిమాండ్ పెరుగుతోంది. కరోనా రెండో వేవ్ తర్వాత హౌసింగ్‌కు డిమాండ్ పుంజుకోవడంతో పండుగ సీజన్ సందర్భంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. గహ రుణాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని బ్యాంకులు 6.5 శాతానికే గృహ రుణాలు ఇస్తున్న విషయం తెలిసిందే.