Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిలో కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ కారద్
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే గొప్ప బీమా సంస్థగా ఎల్ఐసీ ఎదగాలని కేంద్ర సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ కారద్ అన్నారు. ప్రజలకు ఎల్ఐసీ అందిస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్ఐసీ ద్వారా అనేక ప్రయోజనాలు అందుతున్నాయని అన్నారు. సోమవారం ముంబయిలోని ఎల్ఐసీ కేంద్ర కార్యాలయాన్ని కిషన్రావ్ కారద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎల్ఐసీ ఛైర్పర్సన్ ఎం.ఆర్.కుమార్, ఎండీ సిద్ధార్థ మహంతీ, బి.సి.పట్నాయక్..తదితరులు కేంద్రమంత్రికి ఆహ్వానం పలికి, కేంద్ర కార్యాలయంలోని వివిధ విభాగాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధిపతులతో మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో కిషన్రావ్ కారద్ ప్రసంగిస్తూ దేశంలో ఎల్ఐసీ సేవల్ని కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప బీమా సంస్థగా ఎల్ఐసీ ఎదగాలని ఆయన అభిలాష వ్యక్తం చేశారు.