Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహచర న్యాయవాదే హంతకుడు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం ఒక న్యాయవాది దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనతో అస్తి తగాదా ఉన్న మరో న్యాయవాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాయవాది భూపేందర్ సింగ్ జిల్లా కోర్టు కార్యాలయం రెండో అంతస్తులోని ఏసీజేఎం-1 ఆఫీసులో ఫైల్స్‌కు సంబంధించి అక్కడ ఉన్న క్లర్క్‌ను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన మరో న్యాయవాది సురేష్‌కుమార్ గుప్తా తుపాకీతో భూపేందర్‌పై కాల్పులు జరిపాడు. తలలో తీవ్ర గాయాలతో భూపేందర్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న క్లర్కు స్టేట్మెంట్ ఆధారంగా సురేష్ గుప్తాను అదుపులోకి తీసుకుని ఆయన దగ్గర వున్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పి ఎస్.ఆనంద్ తెలిపారు. భూపేందర్ సింగ్ అంతకుముందు ఒక కోచింగ్ సెంటర్‌ను నడిపేవాడని, గుప్తాతో ఆయనకు ఆస్తి తగాదాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీరిద్దరు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారని తెలిపారు.