Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షాలతో బొగ్గు సరఫరాకు అంతరాయం
- రాష్ట్రాలు, ఉత్పత్తిదారులకు లోపించిన ముందుచూపు
న్యూఢిల్లీ : భారత్లో విద్యుత్ సంక్షోభం ఆందోళన కలిగిస్తున్నది. అయితే, ఈ విపత్తుకు కేంద్రం తీరు, అంతర్జాతీయంగా పెరిగిన బొగ్గు ధరలతో పాటు మరికొన్ని కారణాలను విశ్లేషకులు తెలిపారు. దేశంలోని నమోదైన వర్షాలతో పాటు రాష్ట్రాలు, బొగ్గు ఉత్పత్తిదారుల వద్ద దూర దృష్టి లోపించడమూ ప్రస్తుత పరిస్థితికి కారణమైందని వివరించారు. వర్షాల కారణంగా బొగ్గు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. అలాగే, రాష్ట్రాల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం, కోల్ ఇండియాకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతోనూ ప్రస్తుత సమస్యకు కారణమైందని కోల్ స్టాకింగ్ సమాచారం వివరించింది. సరఫరా అందుబాటులో ఉన్న సమయంలో రాష్ట్రాలు బొగ్గు నిల్వలను పెంచుకోలేదని నిపుణులు తెలిపారు. 2018లోనూ భారత్ ప్రస్తుత సమస్యను ఎదుర్కొన్నదని గుర్తు చేశారు. అయితే, 2021 మార్చిలో బొగ్గు నిల్వలు 2018 కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
తగ్గిన బొగ్గు దిగుమతి
దేశంలో ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. వర్షాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పవర్ ప్లాంట్లకు అందే బొగ్గు సరఫరా క్షీణించింది. అలాగే, దేశంలో బొగ్గు దిగుమతి కూడా తగ్గిపోవడం గమనార్హం. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దిగుమతి 18శాతం తక్కువగా ఉండటం గమనార్హం. గతేడాది ఏప్రిల్-ఆగష్టు 20 మధ్య బొగ్గు దిగుమతి 18,120.1 వేల టన్నులగా ఉన్నది. అది ఈ ఏడాది ఏప్రిల్-ఆగష్టు 21 మధ్య 15,239.4 వేల టన్నులకు పడిపోవడం గమనార్హం. కాగా, ఉత్పత్తి అధికంగానే ఉన్నప్పటికీ పవర్ ప్లాంట్ల వద్ద నిల్వలు త్వరగా క్షీణించాయి.
పవర్ డిమాండ్ పెరిగింది
ఇటు దేశంలో పవర్ డిమాండ్ ప్రతి ఏడాదీ పెరిగిపోతున్నది. 2018 నుంచి 2021 వరకు ఆగస్టు, సెప్టెబర్, అక్టోబర్ నెలల్లో పవర్ డిమాండ్ పెరగడం గమనార్హం. 2021 ఆగస్టులో పవర్ డిమాండ్ 190 మెగావాట్లు (ఎండబ్ల్యూ)గా ఉన్నది. కిందటేడాది అది 166 ఎంటీలు మాత్రమే కావడం గమనార్హం. ఇక గతేడాది సెప్టెంబర్లో ఇది 175 ఎండబ్లూగా ఉండగా, అది 2021లో 176 ఎండబ్ల్యూకు పెరిగింది. ఇక గతేడాది అక్టోబర్లో పవర్ డిమాండ్ 169 మెగావాట్లు ఉండగా, అది ఈ ఏడాది అక్టోబర్ 15 నాటికి 174 ఎండబ్ల్యూకు చేరడం గమనార్హం. ప్రభుత్వరంగ సంస్థలైన సీఐఎల్, ఎస్సీసీఎల్లపై కేంద్రం నియంత్రణ ఉంటుందనీ, అయితే బొగ్గు లభ్యత, సరఫరా, కొరత, దిగుమతి విషయంలో రాష్ట్రాలను హెచ్చరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని నిపుణులు వివరించారు.