Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్
భోపాల్: కరోనా మహమ్మారి ప్రారంభంలో భారత్‌లో కల్లోలం రేపింది. మరీ ముఖ్యంగా కోవిడ్-19 సెకండ్‌వేవ్ కారణంగా దేశ ఆరోగ్య వ్యవస్థ డొల్లతనం తేటతెల్లం అయింది. రోగులతో ఆస్పత్రులు నిండిపోవడంతో పాటు ఆక్సిజన్ కొరత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది మార్చిలో కరోనా విజృంభణకు ముందు మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు లేవని రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కరోనా సెకండ్‌వేవ్ తర్వాత రాష్ట్రంలో రోజుకు 182 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును ఉత్పత్తి చేసే 163 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 2020 మార్చిలో (కరోనా వ్యాప్తికి ముందు) రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు అందుబాటులో లేవన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 202 ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయనీ, నిత్యం 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పిత్తి చేస్తున్నాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా మరో 39 ఆక్సిజన్ ప్లాంట్లను పూర్తి చేయనున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 360 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్‌తో కూడిన సామూహిక నిల్వ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలోని 34 జిల్లా ఆస్పత్రుల్లో ఒక్కొక్కటిలో 6 కిలో లీటర్ల సామర్థ్యం, 248 మెట్రిక్ టన్నుల సామూహిక సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.