Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నిర్ణయం
లక్నో : వచ్చే ఏడాది జరిగే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 40 శాతం టికెట్లను మహిళలకు కేటాయిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. మహిళలు మార్పు తీసుకురాగలరని, వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా వాద్రా తెలిపారు. మంగళవారం ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ 'ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలికల కోసం, మార్పును కోరుకునే మహిళల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే, నన్ను నిర్బంధించి, సీతాపుర్ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లిన మహిళా పోలీసు సిబ్బంది కోసమూ ఈ నిర్ణయం తీసుకున్నాం. మహిళలు మార్పు తీసుకురాగలరు. వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న విద్వేష రాజకీయాలను మహిళలు మాత్రమే అంతం చేయగలరు. మీరు నాతో కలిసి పనిచేయాలని అభ్యర్థిస్తున్నా' అని అన్నారు. అలాగే అభ్యర్థి సామర్థ్యమే టికెట్‌ను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.