Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిటీకి చైర్మన్‌గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ
న్యూఢిల్లీ : ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఈఏటీ) ఛైర్పర్సన్ నియామకానికి సంబంధించి సెర్చ్ కం సెలక్షన్ కమిటీని కేంద్రం నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మెన్‌గా, కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి, పెట్రోలియం సహజవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఢిల్లీ హైకోర్టు మాజీ సిజె జస్టిస్ జి.రోహిణిలను సభ్యులుగా నియమించింది. సభ్య కార్యదర్శిగా విద్యుత్తు శాఖ కార్యదర్శిని నియమించింది. ఈ కమిటీ నూతన ఛైర్పర్సన్ నియామకానికి సంబంధించి కేంద్రానికి సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం 2021 సెక్షన్ 3(3) అనుసరించి ఈ సెర్చ్ కం సెలక్షన్ కమిటీని కేంద్రం నియమిస్తూ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.