Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుల్లో 42శాతం జడ్జీల పోస్టులు ఖాళీలు
- తెలంగాణ సహా ఐదు హైకోర్టుల్లో 50శాతం పైగా ఖాళీలు
- పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి వెల్లడి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అన్ని రకాల కోర్టుల్లో 4.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చి సంస్థ పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 42 శాతం న్యాయమూర్తి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 1,098 న్యాయమూర్తి పోస్టులకుగానూ 465 (42శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. అలాగే తెలంగాణ, పాట్నా, రాజస్థాన్, ఒరిస్సా, ఢిల్లీ హైకోర్టుల్లో 50శాతం కంటే ఎక్కువ న్యాయమూర్తి పదవులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. మేఘాలయ, మణిపూర్ హైకోర్టుల్లో ఖాళీలు లేవు. న్యాయ వ్యవస్థలోని ఖాళీలు అధిక కేసుల పెండింగ్‌కు దోహదం చేస్తాయని ఆ సంస్థ తెలిపింది. సెప్టెంబరు 4 నాటికి సుప్రీం కోర్టులో కేసులు, సెప్టెంబరు 15 నాటికి హైకోర్టులు, సబార్డినేట్ కోర్టుల్లో కేసుల పెండింగ్ వివరాలను పిఆర్ఎస్ మంగళవారం విడుదల చేసింది.
తెలంగాణ హైకోర్టుకు సంబంధించి తాజాగా ఏడుగురు న్యాయమూర్తుల నియామకంతో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం సంఖ్య 18కి చేరిన విషయం విదితమే. తెలంగాణ హైకోర్టుకు 42మంది న్యాయమూర్తులను నియమించొచ్చు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పిఆర్ఎస్ తెలిపింది.
2010-2020 మధ్య అన్ని కోర్టుల్లోనూ పెండింగ్ కేసుల సంఖ్య ఏటా 2.8 శాతం పెరుగు తున్నది. 2021సెప్టెంబర్ 15 నాటికి దేశంలోని అన్ని కోర్టులలో 4.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.