Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లోక్‌నీతి సత్యాగ్రహం కిసాన్ జన్ జాగరణ్ పాదయాత్ర బుధవారం ఉదయం పాదయాత్ర ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసి నగరంలోకి ప్రవేశిస్తుంది. వారణాసిలో యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభ ప్రశాంతంగా నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని ఎస్‌కెఎం కోరింది. మంగళవారం పాదయాత్రలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, బిఆర్ పాటిల్, సునీలం తదితరులు పాల్గొన్నారు. ఈ పాదయాత్రకు నవ నిర్మాణ కషక్ సంఘటన్ నేత అక్షరు కుమార్ నాయకత్వం వహించారు. ఈ నెల 2న గాంధీ జయంతి నాడు చంపారన్‌లో ప్రారంభమైన ఈ యాత్ర 330 కిలో మీటర్ల మేరా సాగి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్ జిల్లాలోకి ప్రవేశించింది.
కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను వెంటనే తొలగించాలని, అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ మేరకు మంగవారం ఎస్‌కెఎం ప్రకటన విడుదల చేసింది. లఖింపూర్ ఖేరీ మారణకాండలో న్యాయం జరిగే వరకు ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. అలాగే సింఘూ సరిహద్దు వద్ద హత్య కేసులో ఉన్న నిహాంగ్ సిక్కు నేత 2021 జూలైలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, సహాయ మంత్రిని కలిసినట్లు ఎస్‌కెఎం తెలిపింది. సింఘూ సరిహద్దు వద్ద జరిగిన హత్యతో బిజెపి, దాని ప్రభుత్వాలు లఖింపూర్ ఖేరీ మారణకాండ నుంచి దష్టి మరల్చే కుట్రలో ఉన్నాయని ఎస్‌కెఎం విమర్శించింది. ఈ హత్యపై అత్యవసర, సమగ్ర దర్యాప్తు అవసరమని ఎస్‌కెఎం పేర్కొంది.