Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ : ఎల్ఐసి వంటి కంపెనీ ఆర్థిక పరిమాణం ఎంత అన్న విషయాన్ని ఏడాదికోసారి అంతర్గతంగా మదింపు చేయాల్సిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కానీ ఇప్పటివరకు అది జరుగలేదని పేర్కొన్నారు. ఎల్ఐసిలో వాటాల విక్రయానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఎల్ఐసి ఐపిఒకు వెళుతుందన్నారు. దీనికి ప్రక్రియ ఉంటుందన్నారు. వచ్చే మార్చి కల్లా ఎల్ఐసిలో వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసింది.