Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : చిన్న మొత్తాల పొదుపు పథకాలపై మోడీ సర్కార్ వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశాలున్నాయి. దీనికి ఆర్బిఐ తాజా బులెటిన్ సంకేతాలే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై 47 నుంచి 178 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీని చెల్లిస్తోందని ఆర్బిఐ అభిప్రాయపడింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) వడ్డీ రేటు 6.63 శాతంగా ఉంటే సరిపోతుందని ఆర్బిఐ పేర్కొంది. ప్రస్తుతం దీనిపై 7.1 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది.