Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి.. గత రెండురోజుల్లో 34 మంది మృతిచెందారు. భారీ వర్షాలకు అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరద ఉధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో..ఇండ్లు ధ్వంసమయ్యాయి. నైనితాల్ జిల్లా అతలాకుతల మైంది.కత్గోడం రైల్వే స్టేషన్‌ను కలిపే రైల్వే లైన్ కూడా కొట్టుకుపోయింది. రామ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయకబృందాలు రంగంలోకి దిగి..శిధిలాల కింద చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీయటానికి ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు రోడ్లపై ఉంచిన వాహనాలు వర్షపునీటిలో కొట్టుకుపోతున్నాయి. హల్ద్వానీలోని గౌలానది ఉప్పొంగటంతో..ప్రమాదకరంగా పరుగులు తీస్తున్నది. ఇక చంపావత్ ప్రాంతంలో చల్తీ నదికి వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. వర్షాల కారణంగా కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు.