Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్తులు కొన్న కేంద్ర మంత్రులు!
- మోడీ మంత్రివర్గంలో 12మంది స్థిరాస్తుల కొనుగోలు
న్యూఢిల్లీ : గత ఏడాది మార్చితో మొదలైన కోవిడ్ సంక్షోభం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. కోట్లాదిమంది ప్రజల్ని రోడ్డునపడేసింది. గత ఏడాదిన్నర కాలంగా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలుసు. అయితే కోవిడ్ సమయంలోనూ మోడీ సర్కార్‌లోని 12మంది మంత్రులు భారీ ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేశారని తెలిసింది. కోవిడ్ మొదటివేవ్ అనంతరం 12నెలల కాలంలో స్థిరాస్తులు కొనుగోలు చేసిన కేంద్ర మంత్రుల వివరాల్ని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) వెబ్సైట్లో విడుదల చేశారు. అందులో తెలిపిన సమాచారం ప్రకారం, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రమంత్రివర్గంలో 78మంది సభ్యులుం డగా, అందులో 12మంది, వారి కుటుంబసభ్యులు వ్యవసాయ, వ్యవసాయేతర స్థలాల్ని కొనుగోలు చేశారు. భూములు కొనుగోలుచేసిన వారిలో కేబినెట్ స్థాయి మంత్రులైన ఎస్.జైశంకర్,స్మృతీ ఇరానీ, సర్బా నంద సోనోవాల్,సహాయమంత్రులు 9మంది ఉన్నారు. విదేశాంగమంత్రి జైశంకర్ దక్షిణ ఢిల్లీలో వసంత్ విహార్‌లో రూ.3.87కోట్లతో 3085 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలుచేశారు. గత ఏడాది ఆగస్టు 8న ఈ ఫ్లాట్‌ను ఆయన కొనుగోలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో స్మృ తీ ఇరానీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి లోక్సభస్థానంలోని రూ.12.11లక్షలతో మేదాన్ గ్రామంలో 1600 చదరపు గజాల స్థలాన్ని కొన్నారు. ఇక మరో కేంద్రమంత్రి సోనోవాల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో డిబుర్గర్(అసోం)లో మూడు స్థలాల్ని కొనుగోలు చేశారు. రూ.6.75లక్షలు, రూ.14.40లక్షలు, రూ.3.60లక్షలతో స్థిరాస్తులను కొన్నట్టు ఆయన డిక్లేరేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 45మంది కేంద్ర సహాయమంత్రులుండగా, అందులో 9మంది స్థిరాస్తులు కొనుగోలు చేశామని డిక్లేరేషన్ ఇచ్చారు.