Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష
- నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం
అమరావతి : టీడీపీ కేంద్ర కార్యాలయం, జిల్లా కార్యాల యాలు, టీడీపీ నేతల ఇండ్లపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా అట్టుడికింది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు టీడీపీ పిలుపివ్వ టంతో.. ముంద స్తుగా నేతల అరెస్టులు, నిరసనలు, గృహనిర్బంధాలతో హౌరెత్తింది. బస్టాండ్లు, వ్యాపార సముదాయాలను మూసివేయించారు. అయితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. వైసీపీ దాడులకు తెగబడిన తీరుకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేయను న్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 36 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టనున్నారు. 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరుతో ఈ దీక్షకు దిగనున్నారని పార్టీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీక్ష అనంతరం శనివారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం.