Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజూ మార్కెట్లకు నష్టాలు
ముంబయి : వరుసగా నూతన రికార్డులను నమోదు చేస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లతో ప్రతికూలత నెలకొంది. అమ్మకాల ఒత్తిడితో వరుసగా రెండో రోజూ బుధవారం సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 456 పాయింట్లు కోల్పోయి 61,260కి పడిపోయింది. ఇంట్రాడేలో 61,109 కనిష్టానికి తగ్గింది. లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్ఎస్ఇ నిఫ్టీ 152 పాయింట్లు పతనమై 18,267 వద్ద ముగిసింది. ఒక్క సెషన్లోనే రూ.3.3 లక్షల కోట్ల మదుపు సంపద కరిగిపోగా.. రెండు సెషన్లలో మదుపర్లు రూ.6.6 లక్షల కోట్లు నష్టపోయారు. లోహ, రియల్ ఎస్టేట్, ఫార్మా, పీఎస్‌యూ రంగ సూచీలు అధిక ఒత్తిడికి గురైయ్యాయి. టైటన్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, రిలయన్స్ సూచీలు అధిక నష్టాలను చవి చూసిన వాటిలో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలు ఆర్జించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.